“రేప్ అయినా అమ్మాయిలా ఉండేది నా పరిస్థితి” అని సల్మాన్ ఖాన్ ఇటీవల చేసిన స్టేట్ మెంట్ పై బాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అయ్యారు. కానీ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాఖీ సావంత్ ఏమో.. “సల్మాన్ అలా అని ఉండడు, ఆయన అలాంటివాడు కాదు” అంటూ సల్మాన్ పై ప్రేమ కురిపిస్తోంది.
ప్రపంచం మొత్తం సల్మాన్ ఖాన్ ను తప్పుబడుతుండగా.. రాఖీ సావంత్ మాత్రం అతడ్ని సపోర్ట్ చేస్తుండడం కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటుండగా.. సల్మాన్ పై గల అభిమానంతోనే తాను అలా రియాక్ట్ అయ్యాను కానీ నాకు పబ్లిసిటీ అవసరం లేదని రాఖీ సమాధానమిస్తోంది!