నేను పోర్న్ స్టార్ ని కాబోతున్నానోచ్ -రాఖీ సావంత్
- February 17, 2016 / 01:28 PM ISTByFilmy Focus
ఇప్పుడు బాలీవుడ్ మొత్తం ఆశ్చర్య పోతున్న వార్త ఏదైనా ఉంది అంటే అది రాఖీ సావంత్ ఇచ్చిన స్టేట్మెంట్.బాలీవుడ్ లో కొంతకాలం క్రితం ఐటెంబాంబ్ గా తన అందాలతో ప్రేక్షకులను అలరించిన రాఖీ సావంత్ ఇటీవల పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఎంట్రీ తో తనకు వచ్చే అవకాశాలు కాస్త ఎగరేసుకుపోతుండటంతో కెరీర్ లో సరైన సినిమాలు లేక ఖాళీగా గడిపేస్తుంది. ఈ కోపాన్ని సన్నీలియోన్ పై కొంతకాలంగా పలు మీడియా సమావేశాల్లో విమర్శల రూపంలో చూపిస్తూనే ఉంది రాఖీ సావంత. సన్నీలియోన్ ఐటెంసాంగ్ లనుండి హీరోయిన్ వరకు సక్సెస్ ఫుల్ కెరీర్ ని సాగిస్తుండటంతో పాటు పలువురు స్టార్ హీరోలు సైతం ఆమెకి మద్దతు తెలుపుతుండటంతో రాఖీ సావంత్ సంచలన నిర్ణయం తీసుకుంది.
తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న రాఖీ సావంత్ ని ‘సన్నీలియోన్ కి అమీర్ ఖాన్ మద్దతు ఇవ్వడం పట్ల మీ స్పందన ఏంటి ? అని అడిగిన ప్రశ్నకి రాఖీ సమాధానమిస్తూ ‘ఈ రోజు నేను మీకొక శుభవార్త చెప్పబోతున్నానని.., ఇక త్వరలో మీ రాఖీ సావంత్ పోర్న్ స్టార్ గా కనిపించబోతుందని’ చెప్పి ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్ళిపోయింది. రాఖీ సావంత్ తీసుకున్న ఈ నిర్ణయానికి అక్కడున్న వారితో పాటు షో చూస్తున్న అభిమానులు కూడా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. సినిమా అవకాశాల కోసం పోర్న్ స్టార్ గా మారుతాను అని చెప్పిందా లేదా సన్నీలియోన్ మీద కోపంతోనే అలాంటి కామెంట్స్ చేసిందో తనకు మాత్రమే తెలియాలి
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














