Rakshit Shetty: రక్షిత్ శెట్టి ఫస్ట్ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులా.. అతను మిత్రద్రోహి అంటూ?

కన్నడ హీరో రక్షిత్ శెట్టి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రక్షిత్ శెట్టికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఈ స్టార్ హీరో తన ఫస్ట్ లవ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ గా గతంలో వార్తల్లో నిలిచిన రక్షిత్ చార్లీ 777, సప్త సాగరాలు దాటి సైడ్ ఎ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయాలను అందుకున్నారు.

సప్తసాగరాలు దాటి సైడ్ బి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రక్షిత్ శెట్టి తన కాలేజ్ బ్రేకప్ గురించి కీలక విషయాలను వెల్లడించగా ఆ విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. రక్షిత్ శెట్టి మాట్లాడుతూ బీటెక్ సెకండ్ ఇయర్ లో ఒక అమ్మాయిని చూశానని ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వమని రోజూ నా ఫ్రెండ్ కు లవ్ లెటర్స్ రాసి ఇచ్చేవాడినని చెప్పుకొచ్చారు. అలా రెండేళ్లు గడిచిపోయినా అమ్మాయి నుంచి రెస్పాన్స్ రాలేదని రక్షిత్ శెట్టి కామెంట్లు చేశారు.

ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను ఇచ్చిన లెటర్స్ ను నా స్నేహితుడు ఆ అమ్మాయికి ఇవ్వలేదని రక్షిత్ శెట్టి అన్నారు. ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు వాళ్లిద్దరూ భార్యాభర్తలు అని రక్షిత్ శెట్టి కామెంట్లు చేశారు. అయితే ఈ హీరో చెప్పిన విషయాలు విన్న నెటిజన్లు ఆ వ్యక్తి స్నేహితుడు కాదని మిత్రద్రోహి అని చెబుతున్నారు. రక్షిత్ శెట్టి సప్తసాగరాలు దాటి సైడ్ బి సినిమాతో కూడా సక్సెస్ అందుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

కొందరు నెటిజన్లు మాత్రం (Rakshit Shetty) రక్షిత్ శెట్టికి ప్రేమ కలిసిరాలేదని అందువల్లే లైఫ్ లో రెండుసార్లు లవ్ లో ఫెయిల్ అయ్యారని అభిప్రాయపడుతున్నారు. రక్షిత్ శెట్టి కోసం మంచి అమ్మాయి ఎక్కడో పుట్టి ఉంటుందని ఆ అమ్మాయి రక్షిత్ లైఫ్ లోకి త్వరలోనే వస్తుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రక్షిత్ శెట్టి తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం విజయాలను సొంతం చేసుకొని కెరీర్ పరంగా ఎదగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus