రకుల్ ప్రీత్ సింగ్ అంటే నార్త్,సౌత్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.ఈమె మొదటగా తెలుగులోకి కెరటం అనే సినిమాతో వచ్చింది. కానీ ఈ సినిమా రకుల్ కి ఛాన్సులు తెచ్చి పెట్టలేదు.దాంతో బాలీవుడ్ కి చెక్కేసినప్పటికీ బాలీవుడ్ లో కూడా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హిట్టు కొట్టింది. అలా తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది.
అయితే బాలీవుడ్లో ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పటికీ (Rakul Preet) ఆమెకు నటిగా అంతగా గుర్తింపు రావడం లేదు. కానీ పర్సనల్ విషయాల వల్ల బాలీవుడ్ లో చాలా వైరల్ గా మారుతుంది. ఎందుకంటే ఈమె బాలీవుడ్ నిర్మాత,నటుడు అయినా జాకీభగ్నానితో గత కొద్ది రోజుల నుండి రిలేషన్ లో ఉంది. అయితే వీళ్లిద్దరూ రహస్యంగా పెళ్లిచేసుకున్నారంటూ అనేకసార్లు వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై రకుల్ స్పందించింది. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి మాట్లాడింది.
‘‘మేమిద్దరం రిలేషన్లో ఉన్నామనే విషయాన్ని దాచాలని ఏరోజు అనుకోలేదు. అలా చేయడానికి మేము చిన్నపిల్లలం కాదు కదా..! ప్రేమ, పెళ్లి అనేవి అందరి జీవితాల్లో సహజంగా ఉండేవే. ఇందులో దాచడానికి ఏం ఉండదు. మేము మా ఇద్దరి విషయం అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. కొన్ని మీడియాల్లో ఇప్పటికే రెండు సార్లు మా ఇద్దరికీ పెళ్లి చేసేశారు. గత డిసెంబర్లో మా పెళ్లి అయినట్లు వార్తలు వైరలయ్యాయి.
అప్పుడు మేము ఖండించడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మేము రహస్యంగా వివాహం చేసుకున్నామని రాశారు. కాబట్టి మేము నిజంగా పెళ్లి చేసుకున్న రోజు వాళ్లకు కచ్చితంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మాపై వచ్చిన ఇలాంటి వార్తలు చూసి చాలా నవ్వుకున్నాం. వాళ్లు చాలా నమ్మకంతో రాస్తారు. ఇలాంటివన్నీ నేను సినిమా సెట్లో ఉన్నప్పుడు వస్తుంటాయి’’ అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పింది.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్