Rakul Preet, Samantha: సమంత యు ఫైర్ గర్ల్ అంటూ ప్రశంసలు కురిపించిన రకుల్..!

  • June 9, 2021 / 03:35 PM IST

ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వెబ్ సిరీస్ కు మంచి స్పందన లభిస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రాజీ అనే టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటించింది.ఎన్నో యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా సమంత డూప్ లేకుండా నటించింది. అంతే కాదు తన నటనలో కొత్త కోణాన్ని చూపించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ పాత్ర కోసం సమంత ఎంతో హార్డ్ వర్క్ చేసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఓ ట్రైనర్ ను పెట్టుకుని మరీ శిక్షణ తీసుకుంది.

అయితే ట్రైలర్ విడుదలైనప్పుడు సమంత పాత్ర పై నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళ జనాలు పలు హ్యాష్ ట్యాగ్ లతో సమంత ను ట్రోల్ చేస్తూ ఇండియా వైడ్ ట్రెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కామెంట్లు పటాపంచలు అయిపోయాయని చెప్పొచ్చు. రాజ్-డీకే తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు బాగానే వీక్షిస్తున్నారు. తెలుగులో ఇంకా విడుదల కానప్పటికీ.. హిందీ వెర్షన్ కు ఎక్కువ వ్యూస్ నమోదవుతుండటం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ వెబ్ సిరీస్ లో సామ్ నటనకు గాను మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిదా అయిపోయినట్టు తెలుస్తుంది.

ఈ వెబ్ సిరీస్ పై రకుల్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ‘ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వీక్షించాము. ఇందులో అందరి నటన అద్భుతంగా ఉంది. మనోజ్ బాజ్పాయ్ ఎంత అద్భుతంగా నటించారు అనేది మాటల్లో చెప్పలేము. సమంత యు ఫైర్ గర్ల్! రాజీ పాత్రకు మీరు జీవం పోశారు. మా ఫ్యామిలీ మొత్తం మీకు ఫ్యాన్స్ అయిపోయారు.రాజ్-డికె..మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సీజన్ కు సమంత, మనోజ్ బాజ్పాయి, ప్రియమణి ప్లస్ పాయింట్స్ అనడంలో సందేహం లేదు” అంటూ పేర్కొంది రకుల్ ప్రీత్ సింగ్.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus