నన్ను హాలీడేస్ ఎంజాయ్ చేయనివ్వండి!

  • October 26, 2017 / 08:09 AM IST

ఈ హీరోయిన్ల జీవితాలు ఎలా ఉంటాయంటే.. వరుసబెట్టి సినిమాలు చేస్తుంటేనేమో “బాబోయ్ పాప బాగా బిజీ అయిపోయింది” అంటారు. అదే అమ్మాయి సెలక్టెడ్ గా సినిమాలు చేస్తుందనుకోండి.. వెంటనే “అమ్మాయికి పొగరెక్కువ” అంటారు. అదే అమ్మడు కాస్త గ్యాప్ తీసుకొని తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తుందనుకోండి “అమ్మాయికి ఆఫర్లు తగ్గిపోయాయ్ అందుకే సినిమాలు చేయట్లేదు” అని అపనిందలు వేస్తుంటారు. ప్రస్తుతం రకుల్ పరిస్థితి అలానే ఉంది. గత అయిదేళ్లుగా వరుసబెట్టి సినిమాలు చేస్తూ కనీసం వారం కూడా గ్యాప్ లేకుండా ప్రొజెక్ట్స్ మీద ప్రొజెక్ట్స్ చేసిన రకుల్ ఉన్నట్లుంది అటు కొత్త ప్రొజెక్ట్స్ ఒప్పుకోవడం కానీ.. ఇటు సైన్ చేసిన సినిమాలు సరిగా రిలీజ్ అవ్వకపోయేసరికి గాసిప్పు రాయుళ్ళు దొరికిందే సందని విరుచుకుపడ్డారు.

“రకుల్ కు అవకాశాలు తగ్గిపోయాయి, కొత్తమ్మాయిల వల్ల అవకాశాలు కోల్పోతున్న రకుల్” అని వింత వింత హెడ్డింగ్స్ తో కథనాలు వెల్లువెత్తాయి. మామూలుగా ఇలాంటివి పెద్దగా పట్టించుకోని రకుల్ ప్రీత్.. ఇది ఇలాగే వదిలేస్తే తన కెరీర్ కి మైనస్ అయ్యేలా ఉందని గ్రహించి స్పందించింది.

“లాస్ట్ 5 ఇయర్స్ గా నేను వరుసగా సినిమాల్లో నటించి నటించి అలిసిపోయాను, కొన్నాళ్లు కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలనుకొంటున్నాను, అందుకే బ్రేక్ తీసుకొన్నాను. నాకేం ఆఫర్లు రాకనో లేకనో ఈ నిర్ణయం తీసుకొన్నాను. రేపన్న రోజున జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే “కేవలం సినిమాలు మాత్రమే నా జీవితంలో ఉండకూడదు” అనేది నా అభిప్రాయం. దయచేసి నాపై పుకార్లు పుట్టించడం మానండి” అని తన పి.ఆర్ ద్వారా ప్రపంచానికి వెల్లడించింది. సో, మై డియర్ గాసిప్ రాయుళ్ళు పాపం రకుల్ పాపని తన కుటుంబంతో ఎంజాయ్ చేయనివ్వండయ్యా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus