మెగా ఛాన్స్ మిస్ అయిన రకుల్!

  • June 11, 2016 / 10:18 AM IST

రామ్ చరణ్ తో రెండు సినిమాలు, అల్లు అర్జున్ తో ఒక సినిమా, వరుణ్ తేజ్ తో ఒక సినిమా, సాయిధరమ్ తేజ్ తో మరో సినిమా.. వీటన్నిటితోపాటు అల్లు శిరీష్ కి క్లోజ్ ఫ్రెండ్. ఈ విధంగా ఇప్పటికే “మెగా హీరోయిన్” అనే ట్యాగ్ ను దాదాపుగా తగిలించేసుకొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పవన్ కళ్యాణ్ సరసన కూడా నటిస్తుందని వార్తలొచ్చాయి. ఇక పవర్ స్టార్ తో కూడా నటించేస్తే రకుల్ కి మెగా ట్యాగ్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు అందరూ. అయితే.. ఆఖరి నిమిషంలో అవన్నీ గాలి వార్తాలే అని తేల్చేశారు పవన్ కళ్యాణ్ సినిమా యూనిట్ సభ్యులు.

ఒకవేళ నిజంగా రకుల్ గనుక పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కించుకొని ఉంటే.. వరుస ఫ్లాప్ తో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ తన రెమ్యూనరేషన్ ను కోటికి తగ్గించని అమ్మడు, ఇంకో యాభై లేదా డబ్బై లక్షలు పెంచేసేది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus