వైరల్ అయిన రకుల్ అందాల వీడియో!

టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నంత సేపు ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సాంప్రదాయ బద్ధంగానే ఉన్నింది. మంచి రోల్స్ చేసింది. గత ఏడాది  “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాలో తెలుగమ్మాయి భ్రమరాంబగా ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ గాలిసోకగానే రకుల్ పూర్తిగా మారిపోయింది. “మాగ్జిమ్‌” మేగజీన్ కోసం హద్దులు దాటి స్కిన్ షో చేసింది. ఈ కవర్ పేజ్ హాట్ ఫోటో షూట్ లో బికినీతో మతులు పోగొట్టింది. ఒక్కోరోజు ఒక్కొక్క ఫోటో రిలీజ్ చేస్తూ వార్తల్లో నిలిచింది. తాజాగా మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ కి సంబంధించిన మేకింగ్ వీడియోని రకుల్ పోస్ట్ చేసింది.

అందులో స్పోర్ట్స్ బ్రా, బికినీ తో హీటు పుట్టిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లో వీడియో ఉన్నప్పటికీ విపరీతంగా నచ్చేసింది. ఇందులో రకుల్ ఎక్స్ ప్రెషన్స్ అయితే యువకులకు నిద్రకూడా లేకుండా చేసేలా ఉంది. హిందీ లో ఆమె చేసిన అయ్యారి సినిమా కంటే ఈ వీడియో చాలా  బాగుందని నెటిజనులు కామెంట్లు చేయడం విశేషం. ప్రస్తుతం రకుల్ ఏ తెలుగు సినిమాకి సైన్ చేయకపోయినప్పటికీ  మూడు తమిళ సినిమాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో అజయ్ దేవగన్  సరసన కూడా నటిస్తోంది. ఈ హాట్ వీడియో తో తెలుగు నిర్మాతలు సైతం ఆమె డేట్స్ కోసం క్యూ కట్టడం ఖాయం. వైరల్ అయిన రకుల్ వీడియో మీకోసం…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus