కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్
- June 23, 2018 / 10:39 AM ISTByFilmy Focus
“స్పైడర్” తర్వాత తెలుగులో కనుమరుగైన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలు చేస్తూ కెరీర్ ను నెట్టుకొస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేకపోయినా.. తన భర్త ఇలా ఉండాలి అంటూ కొన్ని నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయట. ఎప్పుడూ తను నవ్వుతూ.. నలుగురినీ.. ముఖ్యంగా తనను నవ్వించే వాడు అయి ఉండాలట.
దీంతో పాటు తనను బాగా ప్రేమించాలట.. పైగా బాగా పొడుగ్గా ఉండే భర్త కావాలంటోంది రకుల్. అంతేలెండి.. 5 అడుగుల 9 అంగుళాల పొడుగరి అయిన రకుల్ ఆరడుగులు ఆజానుబాహుడిని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఈ భామ మహేష్ బాబు స్పైడర్ లో నటిస్తుండగా.. దసరాకు ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ రీసెంట్ గా మహేష్ స్వయంగా చెప్పేశాడు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













