రిక్షా తొక్కడం నేర్చుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్

  • July 26, 2017 / 11:54 AM IST

ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ హ్యాట్రిక్ హిట్ అందుకున్న రకుల్ తాజాగా రారండోయ్ వేడుక చూద్దాంలో భ్రమరాంబ గా అందరి మనసులు దోచుకుంది. ఆమె హీరోయిన్ గా నటించిన జయ జానకి నాయక, స్పైడర్ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం కార్తీ స‌ర‌స‌న తమిళ చిత్రం ‘థీరన్‌ అథికరం ఒండ్రు’ లో నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పుదుచ్చేరిలో జరుగుతోంది. ఇందులో ఆమెది పేద అమ్మాయి పాత్ర. లంగా, జాకెట్టూ వేసుకొని హీరోని తన రిక్షా బండిలో తీసుకుపోవాలి. ఆ సీన్ ని ఈరోజు తెరకెక్కించారు.

కొంత సేపు ప్రాక్టీస్ చేసి సన్నివేశాన్ని కంప్లీట్ చేసింది. అనంతరం రిక్షా తొక్కడం గురించి రకుల్ మాట్లాడుతూ” రిక్షా తొక్కాలి అనగానే నేను భయపడలేదు కానీ  నేను ఎక్కడ రిక్షాను పాడు చేస్తానో అని రిక్షా ఆయన మాత్రం భయపడ్డాడు. అతను బ్రేక్ ఎక్కడ ఉంటుంది? ఎలా బ్రేక్ వేయాలి? అని నాకు మరీ మరీ చెప్పాడు. రిక్షాను తొక్కుతుంటే భలే ఉంది ” అని వివరించింది. రకుల్ ప్రీత్ సింగ్ రిక్షా తొక్కుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus