సూర్యతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్న సాయి పల్లవి, రకుల్

Advertisement

వరుస విజయాలతో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ లు క్రేజీ హీరోయిన్స్ గా మారారు. వీరిద్దరికి అభిమానులు భారీ సంఖ్యలో ఏర్పడ్డారు. సాయి పల్లవి ఒక్క హీరోయిన్ ఉంటే చాలు ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అటువంటిది ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ కూడా కలిస్తే ఆ సినిమాకి భారీ క్రేజ్ రావడం ఖాయం. సూర్య సినిమా విషయంలో అదే జరిగింది. ప్రస్తుతం సూర్య విగ్నేష్ దర్శకత్వంలో తమిళంలో “తానా సేద కూటం” అనే సినిమా చేశారు. దీనిని తెలుగులో గ్యాంగ్ గా రిలీజ్ చేయబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 12 న విడుదలకానుంది.

దీని తర్వాత సూర్య ప్రేమ కథ చిత్రాల దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో నటించబోతున్నారు. డ్రీమ్ వారియర్ పిశ్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రంలో మొదటగా రకుల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. తాజాగా సాయి పల్లవి పేరుని చిత్ర బృందం ఖరారు చేసింది. దీంతో సూర్య ఇద్దరి భామలతో వెండితెరపై రొమాన్స్ చేయనున్నారు. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం షూటింగ్ ని వచ్చే నెల మొదలెట్టి దీపావళికి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus