తన భర్తకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన రకుల్
- August 5, 2017 / 01:27 PM ISTByFilmy Focus
ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత ఏడాది ఆమె నటించిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ సినిమాలు సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ క్రేజీ భామగా మారిపోయింది. ఈ ఏడాది ఆమె రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో భ్రమరాంబగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన జయ జానకి నాయక సినిమా ఈనెల 11 రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఛానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో అనేక సంగతులు చెప్పింది. సిగరెట్టు, మందు తాగే అలవాటు తనకి లేదని చెప్పిన ఈ బ్యూటీ, తనకి ఎక్కువమంది లవ్ ప్రపోజ్ చేయలేదని వెల్లడించింది.
కాలేజీ డేస్ లో ఒకరిద్దరు ప్రపోజ్ చేసినా వారు వేస్ట్ అని వివరించింది. ఎప్పటికైనా ప్రేమ పెళ్లే చేసుకుంటానాని చెబుతున్న రకుల్ ని మీకు భర్తగా వచ్చే వ్యక్తి ఎలా ఉండాలని అడగగా అందుకు స్పందిస్తూ “అతను బాగా ఎత్తు ఉండాలి. సినిమాలంటే ఇష్టం ఉండాలి. అంతేకానీ “నువ్వు అలా ఉండాలి.. ఇలా ఉండాలి..” అని ఆర్డర్ వేస్తే మాత్రం చెప్పు తీసుకుని కొడతాను” అంటూ స్పష్టం చేసింది. మరి ఆ లక్షణాలు ఉన్న హీరో ఎక్కడున్నాడో.. ఈ హీరోయిన్ కి ఎప్పుడు కనిస్తాడో.. వేచి చూద్దాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













