‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో రకుల్ రోల్ అదేనంట

  • May 5, 2017 / 11:36 AM IST

సోగ్గాడే చిన్ని నాయన వంటి చిత్రాన్ని అందించిన కల్యాణ్ కృష్ణ మరో అచ్చమైన తెలుగు సినిమాని మలిచే పనిలో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. నాగార్జున కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయినా నిన్నే పెళ్లాడతా తరహాలో నాగచైతన్యకు ఈ సినిమా ఉండబోతోందని, ఈ చిత్రంలో చైతూ రోల్ కూడా అలాగే ఉంటుందని సమాచారం. అయితే తాజాగా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర గురించి బయటికి వచ్చింది.

ఈ సినిమా షూటింగ్ ఆఖరి రోజు తీసుకున్న ఫోటోని ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ “బ్రమరాంభ” ని మిస్ అవుతున్నాను” అంటూ రకుల్ కామెంట్ చేసింది. దీంతో ఈ మూవీలో రకుల్ పోషిచే రోల్ పేరు బ్రమరాంభ అని ఖరారు అయింది. పేరుని బట్టి  రకుల్ అచ్చమైన తెలుగు అమ్మాయి పాత్రలో మరో మారు తెలుగు రాష్టాలప్రజలను అలరించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19న విడుదలకానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus