Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నేను పని చేసిన బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో లింగుస్వామి ఒకరు : రామ్ పోతినేని

నేను పని చేసిన బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో లింగుస్వామి ఒకరు : రామ్ పోతినేని

  • June 23, 2022 / 11:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను పని చేసిన బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో లింగుస్వామి ఒకరు : రామ్ పోతినేని

ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో యువ కథానాయకుడు, ఉస్తాద్ రామ్ పోతినేని కనిపించనున్న సినిమా ‘ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.

సినిమాలో ‘విజిల్’ సాంగ్‌ను బుధవారం ప్రముఖ కథానాయకుడు సూర్య ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో లిరికల్ వీడియో ప్రదర్శించారు.

రామ్ పోతినేని మాట్లాడుతూ ”లాస్ట్ సినిమా 50 శాతం అక్యుపెన్సీలో చూశా. ఇప్పుడు థియేటర్‌లో 100 శాతం ఆక్యుపెన్సీ చూస్తుంటే అదిరిపోయింది. మంచి ఫీల్ వచ్చింది. నాకు ఇప్పుడు లాక్‌డౌన్‌ తీసినట్టుంది. ‘విజిల్’ వేసే బాధ్యత మీది (ప్రేక్షకులను ఉద్దేశిస్తూ)… వేయియించాల్సిన బాధ్యత నాది. మేం అడిగిన వెంటనే సాంగ్ విడుదల చేసిన సూర్య గారికి థాంక్స్. ముందుగా… దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడాలి. ‘బుల్లెట్…’ సాంగ్‌తో స్టార్ట్ చేశాడు. అది ఇంకా రన్ అవుతుంది. ఎక్కడా ఆగడం లేదు. ఈ రోజే విడుదల చేశామా అన్నట్టు ట్రెండ్ అవుతోంది. సౌత్ ఇండియా అంతా షేక్ చేస్తోంది. ‘విజిల్’ సాంగ్‌కు కూడా సూపర్ డూపర్ హిట్ ట్యూన్ ఇచ్చాడు. నెక్స్ట్ సాంగ్స్ కూడా విన్నాను. షూట్ చేశాడు. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. నా మీద తనకు ఉన్న ప్రేమను పాటల్లో చూపిస్తాడు డీఎస్పీ. నా కెరీర్ అంతా చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చాడు. ‘విజిల్’ సాంగ్ షూట్ చేసేటప్పుడు ‘ది వారియర్’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో అర్థం అయ్యింది… చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా సాంగ్ ఫినిష్ చేయాలని చేశాం. రంజాన్ సమయంలో ఉపవాసం చేస్తూ జానీ మాస్టర్ సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. వేరే షూటింగ్ ఉన్నప్పటికీ… మేనేజ్ చేసి డేట్స్ అడ్జస్ట్ చేసి కృతి ఈ సాంగ్ చేసింది. ఈ సినిమాలో మాస్ కృతిని చూస్తారు. ఫుడ్ పాయిజన్ అయ్యి రెండు రోజులు ఆస్పత్రిలో ఉన్నప్పటికీ… సుజీత్ లైటింగ్ దగ్గరనుంచి ప్రతి విషయంలో కేర్ తీసుకున్నారు. దర్శకుడు లింగుస్వామి గారు ప్రతి ఫ్రేమును ఆయన భుజాలపై మోశారు. అద్భుతంగా సినిమా తీశారు. నేను పని చేసిన బెస్ట్ డైరెక్ట‌ర్స్‌లో ఆయన ఒకరు. ‘ది వారియర్’కు మంచి టీమ్ కుదిరింది. టీమ్ వర్క్ సినిమాలో చూస్తారు. ఇక, ‘విజిల్’ సాంగ్ గురించి ఒక్కటే చెబుతా… ఇది టిక్ టాక్ సాంగ్ కాదు, థియేటర్ సాంగ్. థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. అభిమానుల కోసం సినిమాలో చాలా ఉన్నాయి” అని అన్నారు.

కృతి శెట్టి మాట్లాడుతూ ”ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు. అయితే… వాళ్ళను చూస్తుంటే నాకు విజిల్ వేయాలనిపిస్తోంది. రామ్ గారు ఉంటే సినిమాలో ఒక ఎనర్జిటిక్ సాంగ్ ఉండాలి. ఆయన పెర్ఫార్మన్స్ చూడటం కోసం! విజిల్ మహాలక్ష్మి కోసం ఒక విజిల్ సాంగ్ సిట్యువేషన్ క్రియేట్ చేసినందుకు లింగుస్వామి గారికి థాంక్స్. ‘ఉప్పెన’ తర్వాత డీఎస్పీ గారితో నేను చేస్తున్న చిత్రమిది. సూపర్ సాంగ్స్ ఇచ్చారు. ‘ఉప్పెన’లో సాంగ్స్ పెద్ద హిట్. ‘ది వారియర్’ ఫస్ట్ సాంగ్ విడుదలైనప్పుడు ఆల్బమ్ పెద్ద హిట్ కావాలని కోరుకున్నాను. హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. ‘బుల్లెట్’ సాంగ్‌లో విజువల్స్ చూశారు. అందులో ప్రొడక్షన్ వేల్యూస్ తెలుస్తాయి. బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు ప్రొడక్షన్ వేల్యూస్ ఇంకా బాగా తెలుస్తాయి. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు” అని అన్నారు.

దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ ”స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలని పదేళ్ల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను. హీరోలు, నిర్మాతలను కలిశాను. అప్పుడు జరగలేదు. ‘ది వారియర్’, ఈ టీమ్ కోసమే వెయిట్ చేస్తున్నాని తర్వాత అర్థమైంది. మా హీరో రామ్ గారి ఎనర్జీ, డీఎస్పీ ఎనర్జీ, నా ఎనర్జీ, మా టీమ్ అందరి ఎనర్జీ ఒకే లెవెల్‌లో ఉంది. మీకు ‘విజిల్’ సాంగ్‌లో కనపడి ఉంటుంది. అద్భుతమైన సందర్భంగా ఈ పాట వస్తుంది. సాంగ్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు అందరూ పెద్ద పెద్ద విజిల్స్ వేస్తారని అనుకుంటున్నాను. ‘బుల్లెట్…’ సాంగ్ విడుదల తర్వాత ఒక రెస్టారెంట్‌కు ‘మా పిల్లలు బుల్లెట్ సాంగ్ పెడితేనే తింటారు సార్. మీ సాంగ్ అంత పెద్ద హిట్’ అని తల్లిదండ్రులు చెప్పారు. షార్ట్ వీడియోస్ లో 900 కోట్ల మంది ‘బుల్లెట్’ సాంగ్ చేశారు. త్వరలో వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవచ్చు. ‘బాహుబలి’ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. నా సాంగ్ షార్ట్ వీడియోస్ రూపంలో వెయ్యి కోట్లు చేరుకుంది. ప్రేక్షకుల ఆశీర్వాదంతో సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి సాంగ్స్, సినిమా కోసం ఏం అడిగితే అది ఇచ్చారు. మమ్ముట్టి గారితో మొదలు పెడితే… మాధవన్, సూర్య, విక్రమ్, అజిత్ వంటి మంచి హీరోలతో నేను పని చేశాను. రామ్ స్పెషాలిటీ ఏంటంటే… స్కిప్ట్ విన్న రోజు నుంచి సినిమా కంప్లీట్ అయిన తర్వాత చూసే వరకూ ఎనర్జీ లెవల్ ఎక్కడా తగ్గలేదు. ఆయన నెక్స్ట్ లెవల్ హీరో. అది నాకు తెలుస్తుంది. త్వరలో మీకు తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అన్ని హిట్ సాంగ్స్ ఇచ్చారు. మా సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, ప్రొడక్షన్ డిజైనర్ సత్యనారాయణ, సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవన్, ‘విజిల్’ తెలుగు పాటకు సాహిత్యం అందించిన సాహితి, ‘విజిల్’ తమిళ పాటకు సాహిత్యం అందించిన వివేక్ తదితరులు పాల్గొన్నారు.

రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా, ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళ: డి.వై. సత్యనారాయణ, యాక్షన్: విజయ్ మాస్టర్ & అన్బు-అరివు, ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా – లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్, స‌మ‌ర్ప‌ణ: ప‌వ‌న్ కుమార్‌, నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శ‌క‌త్వం: ఎన్‌. లింగుస్వామి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lingu Samy
  • #Ram
  • #Warriorr

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

4 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

6 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

22 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

23 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 days ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

2 days ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

2 days ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version