ధృవ కోసం ఇష్టం లేని పని చేసిన రామ్ చరణ్ తేజ్

  • December 5, 2016 / 01:16 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం ధృవ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి అందరూ మాట్లాడుకునే అంశం చెర్రీ లుక్. ఒక యువ ఐపీఎస్ ఆఫీసర్ ఎలాగుంటారో అలాగే చరణ్ తన బాడీని మలుచుకున్నారు. ఈ కొత్త లుక్ కోసం మెగా హీరో ఇష్టం లేని పని చేశారు. జిమ్ కి వెళ్లి కఠిన మైన వర్కౌట్స్ చేశారు. మెగా హీరోకి చిన్నప్పటినుంచి ఈ వ్యాయామం అంటే మహా చిరాకు. చెమట వచ్చే వరకు డ్యాన్సులు వేయడం, ఒత్తిడి ఎగిరి పోయేవరకు గుర్రాలు స్వారీ చేయడమే ఇష్టం. కానీ ధృవ కథ నచ్చడంతో ఇష్టం లేకపోయినా జిమ్ బాట పట్టారు. ఫిట్ నెస్ నిపుణులు చెప్పిన డైట్ ని పక్క ఫాలోఅయ్యారు.

హిట్ కొట్టాలనే కసితో సిక్స్ ప్యాక్ బాడీని సొంతం చేసుకున్నారు. అదే బాడీని ఏడాది పాటు మైంటైన్ చేశారు. ఆ శ్రమ ధృవ టీజర్, ట్రైలర్ లో స్పష్టంగా తెలుస్తోంది. థియేటర్లోకి వచ్చిన తర్వాత కష్టానికి తగ్గ ప్రతిఫలం పూర్తిగా దక్కనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనాటి హీరో అరవింద్ స్వామి విలన్ గా కనిపించనున్నారు. విభిన్నమైన హీరో, వినూత్నమైన విలన్ మధ్య పోరును దర్శకుడు సురేందర్ రెడ్డి  ఉత్కంఠ భరితంగా లెన్స్ లో బంధించారు. ఈ యుద్ధం ఎలా ఉండబోతుందో మరో నాలుగు రోజుల్లో తెలియనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus