మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ శుభాకాంక్ష‌లు అందుకున్న ఏక్ మినీ క‌థ చిత్ర బృందం

అమెజాన్ ప్రైమ్ వీడియో స‌మ‌ర్ప‌ణ‌లో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగ్ మాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఏక్ మినీ క‌థ. ప్ర‌స్తుత ప‌రిస్థితుల రీత్య‌, ఈ సినిమాను డైరెక్ట్ ఓటిటి పద్ధ‌తిలో మే27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ ఓటిటి ప‌ద్ధ‌తిలో విడుదల చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఏక్ మినీ క‌థ ప్ర‌మోష‌న్ కంటెంట్ కి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న సోష‌ల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా ఏక్ మినీ క‌థ చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. చిత్ర ట్రైల‌ర్ తాను చూసాను అని, చాలా ఆస‌క్తికరంగా ఉంద‌ని రామ్ చ‌ర‌ణ్ పోస్ట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా నా స్నేహితులైన యూవీ క్రియేష‌న్స్ నిర్మాత‌ల‌కు, నా ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను అని రామ్ చ‌ర‌ణ్ తెలిపారు. ఇటీవ‌లే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సైతం ఏక్ మినీ క‌థ చిత్ర బృందానికి త‌న ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు అందించిన సంగ‌తి తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉంటూ తమ సినిమా చూడాలని కోరారు ఏక్ మినీ కథ యూనిట్.

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు.. టెక్నికల్ టీమ్:దర్శకుడు: కార్తీక్ రాపోలు, నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, క‌థ‌: మేర్లపాక గాంధీ, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి, ఎడిటర్: సత్య, PRO: ఏలూరు శ్రీను, మేఘశ్యామ్

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus