తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని బయటపెట్టిన రామ్ చరణ్!

Advertisement

నటుడిగా అనేక విమర్శలను ఎదుర్కున్న రామ్ చరణ్ రంగస్థలం మూవీతో ఆ విమర్శలను తుక్కు తుక్కు చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ చరణ్ లోని అన్ని కోణాలను బయటపెడితే.. అనేక రికార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ తేజ్ మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని చెర్రీ లేకుండా కంప్లీట్ చేశారు. రెండో షెడ్యూల్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఇందులో చరణ్ పై  యాక్షన్ సీన్ పూర్తి చేశారు.  తమిళ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కనల్ కన్నన్ నేతృత్వంలో ఈ ఫైట్ చిత్రీకరించారు. అలాగే బ్యాంకాక్ షెడ్యూల్ ని రీసెంట్ గా కంప్లీట్ చేసిన రామ్ చరణ్.. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని బయటపెట్టారు. “నేను ఆస్తికుడిని. దైవాన్ని నమ్ముతాను. అయ్యప్ప భక్తుణ్ణి. గత పదేళ్లుగా అయ్యప్ప దీక్ష పాటిస్తున్నాను. 45 రోజుల పాటు దీక్షలో ఉంటాను. ఈ  దీక్షలో ఉండడం నా ఆరోగ్యానికి చాలా మంచిది. హీరోని కాబట్టి శరీరాన్ని అనేక విధాలుగా కష్టపెడుతుంటాము. ఈ దీక్ష డీటాక్స్ గా పనిచేస్తుంది. శరీరంలోని మలినాలను తొలిగించి వేస్తుంది. అంతేకాదు అంతర్గతంగా నాకు మంచి బలాన్ని ఇస్తుంది” అని రామ్ చరణ్ వెల్లడించారు. ఈ దీక్షని తన తండ్రి చిరంజీవి నుంచి స్ఫూర్తిగా తీసుకున్నానని స్పష్టం చేశారు. బోయపాటి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మల్టీ స్టారర్ మూవీ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus