స్టైల్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ధృవ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఇందులో విలన్ గా నటించిన అరవింద్ స్వామికి చిత్ర విజయంలో భాగస్వామ్యం ఉంది. ఆయన విలనిజం సినిమాకి ప్లస్ అయిందని విమర్శకులు ప్రశంసించారు. మళ్లీ వీరిద్దరి కలసి నటించనున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం రామ్ చరణ్ తో స్పై థ్రిల్లర్ స్టోరీని తెరకెక్కించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ మూవీలో విలన్ గా అరవింద్ స్వామిని తీసుకున్నట్లు తెలిసింది. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ఫిలిం లో చెర్రీ రా ఏజెంట్ గా నటించనున్నారు.
ఈ మూవీ ని మణిరత్నం ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ విలేజ్ లవ్ స్టోరీ కథతో రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాని వేగంగా పూర్తి చేసి మణిరత్నం దర్శకత్వంలో నటించాలని చెర్రీ తొందరపడుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.