Ram Charan: ఆ రీజన్ వల్లే గాడ్ ఫాదర్ అంచనాలను అందుకోలేదా?

దసరా పండుగ కానుకగా అత్యంత భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన సినిమాలలో గాడ్ ఫాదర్ సినిమా ఒకటి. గాడ్ ఫాదర్ మూవీ బ్లాక్ బస్టర్ అంటూ క్రిటిక్స్ రివ్యూలు ఇవ్వడం, సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం, కథ కథనాలలో మోహన్ రాజా చేసిన మార్పుల వల్ల గాడ్ ఫాదర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా కూడా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉందని చాలామంది భావించారు.

అయితే ఐదురోజుల పాటు పండుగ సెలవులను క్యాష్ చేసుకుని భారీగా కలెక్షన్లను సాధించిన ఈ సినిమా ఆ తర్వాత ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమాతో సక్సెస్ సాధించి వరుస టాలీవుడ్ ఆఫర్లతో బిజీ కావాలని మోహన్ రాజా భావించగా అందుకు భిన్నంగా జరిగింది. నాగ్ సినిమాకు పని చేసే ఛాన్స్ మోహన్ రాజాకు వచ్చినట్టే వచ్చి పోయిందని కామెంట్లు వినిపించాయి.

అయితే గాడ్ ఫాదర్ మూవీ రిజల్ట్ గురించి రామ్ చరణ్ స్పందించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లూసిఫర్ కు రీమేక్ గా గాడ్ ఫాదర్ తెరకెక్కిందని గాడ్ ఫాదర్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చిందని చరణ్ పేర్కొన్నారు. అయితే అప్పటికే లూసిఫర్ ను చూసిన ప్రేక్షకులు గాడ్ ఫాదర్ ను థియేటర్లలో చూడటానికి ఇష్టపడలేదని చరణ్ కామెంట్లు చేశారు.

లూసిఫర్ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉండటమే గాడ్ ఫాదర్ ను దెబ్బ తీసిందని చరణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మన దేశంలోని సినిమా నటులను ఇండియన్ యాక్టర్లు అని పిలవాలని నేను భావిస్తున్నానని చరణ్ చెప్పుకొచ్చారు. శంకర్ డైరెక్షన్ లో నటించడం నా లక్ అని ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రామ్ చరణ్ షాకింగ్ కామెంట్లు చేశారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus