బాబాయి అడగాలే కానీ దేనికైనా రెడీ : రామ్ చరణ్
- January 5, 2019 / 07:42 PM ISTByFilmy Focus
మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ‘వినయ విధేయ రామా’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కైరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన పాటలకు మంచి స్పందన లభించింది. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తుండగా తమిళ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ, హిమజ తదితరులు నటిస్తున్నారు.
ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా చెర్రీ మీడియాతో తన పర్సనల్ విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. చరణ్ మాట్లాడుతూ… “బాబాయ్ అడగాలే కానీ దేనికైనా రెడీ అని చెప్పుకొచ్చాడు. పవన్ బాబాయికి ఎలాంటి సహకారానికైనా నేను ముందుంటాను. ఎందుకంటే.. ఆయన నా బాబాయి. ఆయన అడగాలే కానీ ఏదైనా చేస్తాం. ఆయనకు నచ్చని పని నేను ఎప్పుడూ చేయలేదు… చేయను కూడా. ఆయన నుంచి ఒక్క ఫోన్‌కాల్ వస్తే చాలు మేమంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన పై మాకున్న ప్రేమ అలాంటిది. అలాగే ఆయనకి కూడా మమ్మల్ని అడగడానికి మొహమాట పడరు.. మా మధ్య మొహమాటాలు కూడా ఉండవు”… అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు













