‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనే విషయం పై ఈ మధ్యనే క్లారిటీ ఇచ్చాడు. తన తదుపరి సినిమాని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో చేయబోతున్నట్టు ప్రకటించాడు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రంలో చరణ్ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని..’ఒకే ఒక్కడు’ కి సీక్వెల్ గా ఇది ఉండబోతుందని వార్తలు వినిపించాయి. ఇది పక్కన పెడితే.. ఈ చిత్రం హీరో చరణ్ కు కొత్త టెన్షన్ మొదలైనట్టు తాజా సమాచారం.
అదేంటి అంటే.. శంకర్ ఇప్పుడు ‘లైకా’ నిర్మాతలతో తేల్చుకోవాల్సిన లావాదేవీలు చాలానే ఉన్నాయి. ఇటీవల మరోసారి ఇతను లీగల్ ఇష్యూస్ లో చిక్కుకున్నాడు. ఇవి ఎప్పటికి సాల్వ్ అవుతాయి అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత శంకర్ సినిమా ఉంటుందా? అనే విషయం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంకర్ త్వరగా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని బయటపడితే ఇబ్బంది ఉండదు.లేదంటే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే చరణ్ టెన్షన్ పడుతున్నట్టు టాక్.
‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత చరణ్ కచ్చితంగా పాన్ ఇండియా సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో సినిమా చెయ్యాలని మొదట అనుకున్నాడు కానీ.. అతను వినిపించిన కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉండటం వలన.. పాన్ ఇండియా అప్పీల్ మిస్ అవుతుంది అని భావించి శంకర్ తో సినిమా ఫైనల్ చేసాడట. అయితే ఇప్పుడు శంకర్ ఇబ్బందుల్లో పడ్డాడు కాబట్టి చరణ్.. గౌతమ్ తో సినిమా చేయడం.. లేదంటే వేరే దర్శకుడితో సినిమా సెట్ చేసుకోవడం వంటిది చేయాలి.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!