పని దినాల్లో హైదరాబాద్ రోడ్ల పైన ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. ఆఫీస్ కి వెళ్లే సమయంలో వచ్చే సమయాల్లో రోడ్ల నిండా వాహనాలే కనిపిస్తాయి. కాస్త ముందుగా బయలు దేరకుంటే ఎవరైనా ట్రాఫిక్ పద్మ వ్యూహంలో చిక్కుకోవాల్సిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి కూడా ఈ అనుభవం ఎదురైంది. అతను గురువారం “ధృవ” షూటింగ్ కోసం వెళుతుండగా దారి మధ్యలో గంట పాటు ట్రాఫిక్ లో ఇరుక్కు పోయారు. ఆ పరిస్థితిని తన కెమెరాలో బంధించి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు.
“చాలా ట్రాఫిక్ ఉంది… షూటింగ్‌కు ఆలస్యమైంది. ఈ రోజు ఎలా ప్రారంభం అయింది అనేది విషయం కాదు.. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలన్నదే ఇక్కడ ముఖ్యం. గుడ్ డే ” అని రామ్‌చరణ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రామ్ చరణ్ తాజా చిత్రం “ధృవ” పైనే ఆసలు పెట్టుకున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. రేస్ గుర్రం తో హిట్ అందుకున్నా, కిక్ 2 నిరాశ పరచడంతో “తని ఒరువన్” తమిల్ మూవీని “ధృవ” గా తెరకెక్కిస్తున్నారు డైరక్టర్ సురేందర్ రెడ్డి.