రామ్ చరణ్ దెబ్బకు.. షాక్ తిన్న బాలకృష్ణ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరంజీవి నుంచి యాక్టింగ్ ని.. మేనమామ అల్లు అరవింద్ నుంచి బిజినెస్ ని నేర్చుకున్నారు. ఓ వైపు హీరోగా తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటూనే, నిర్మాతగా తొలిచిత్రంతోనే వ్యాపారసూత్రాలను ప్రయోగిస్తున్నారు. ఖైదీ నంబర్ 150 సినిమాను సరైన టైమ్ కి రిలీజ్ చేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. చిరు ప్రతిష్టాత్మకమైన మూవీని మొదలెట్టినప్పుడే సంక్రాంతికి అని చెప్పడమే కాకుండా జనవరి 13 కి వస్తుందని డీలింగ్స్ మొదలు పెట్టారు. మెగా ఎంట్రీతో పెద్దపండుగ పోటీ నుంచి కొన్ని చిత్రాలు పక్కకు తప్పుకున్నాయి.

దీంతో చెర్రీ కలెక్షన్లను పెంచుకోవడానికి ఖైదీని రెండు రోజులు ముందుగా విడుదలచేస్తున్నట్లు ప్రకటించి ఔరా అనిపించారు. చరణ్ నిర్ణయం నటసింహ బాలకృష్ణకు బాగానే దెబ్బకొట్టింది. బాలయ్య వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతుంది. అయితే తేదీని ప్రకటించలేదు. దీంతో ఈ చిత్రం వ్యాపారం ముందుకు సాగడం లేదు. పైగా చిరంజీవి సినిమా ప్రదర్శనకి థియేటర్లు బుక్ అయిపోతున్నాయి. శాతకర్ణి 11 తర్వాత ఎప్పుడు వచ్చినా థియేటర్లు ఎక్కువగా దొరకడం కష్టం. ఇది ఓపెనింగ్ కలక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న డైరక్టర్ క్రిష్ ఆలోచనలో పడ్డారు. బాలయ్యతో చర్చలు మొదలు పెట్టారు. జనవరి మొదటి వారంలో తమ సినిమా రిలీజ్ చేసేందుకు క్రిష్ నిర్మాతలతో సంప్రదింపులు చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus