Klin Kaara: వేదమంత్రాలతో మెగా వారసురాలికి ఘన స్వాగతం!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇక మెగా కుటుంబంలోకి మూడోతరం వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 20వ తేదీ ఉపాసన రాంచరణ్ దంపతులకు క్లిన్ కారా జన్మించారు. ఇక ఈ చిన్నారి మెగా ఇంటి వారసురాలిగా అడుగుపెట్టడంతో ప్రతి ఒక్కరు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇక ఈ చిన్నారి జన్మించిన తర్వాత ఉపాసన తన కుమార్తెతో కలిసి కామినేని ఇంటికి వెళ్లారు. ఇలా మూడు నెలల పాటు తన పుట్టింట్లో ఉన్నటువంటి ఉపాసన తిరిగి తన అత్తగారింటికి వచ్చారు దీంతో తన వారసురాలికి రామ్ చరణ్ అలాగే చిరంజీవి భార్య సురేఖ చాలా ఘనంగా స్వాగతం పలికారు. చిన్న జీయర్ స్వామి వేద పాఠశాలలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థుల వేదమంత్రాల నడుమ క్లీన్ కారాకు ఘన స్వాగతం పలికారు.

వినాయక చవితి పండుగ సందర్భంగా మెగా వారసురాలు మొదటిసారి తన ఇంటికి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో తనకు ఈ విధంగా స్వాగతం పలికారు. ఇలా చిన్న జీయర్ స్వామి విద్యార్థులు వేదమంత్రాల నడుమ తన కూతురికి స్వాగతం పలకడంతో ఉపాసన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక రాంచరణ్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. రాంచరణ్ సైతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఇక ఇందులో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus