మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో చెర్రీ..?

  • June 20, 2016 / 12:43 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలో నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రంలో ఫైటింగ్ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోగా… ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘ధృవ’ కోసం కూడా మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడట. జపాన్ మార్షల్ ఆర్ట్స్ అయిన ‘ఐకిడో’ లో చెర్రీ తర్ఫీదు పొందుతుండగా..

ఇందుకోసం ఓ ప్రత్యేక శిక్షకుడిని కూడా నియమించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. గతంలో పవన్ నటించిన జానీ చిత్రీకరణ లో కూడా పవన్ ఈ మార్షల్ ఆర్ట్స్ ను నేర్చుకున్నాడు. కాగా ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus