ఉరమాస్ సినిమాకి మరీ ఇంత క్లాస్ టైటిలా ?

  • October 8, 2018 / 10:21 AM IST

రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. ఈ సినిమా టైటిల్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. ఇటీవల చిరంజీవి పాత సినిమా ‘స్టేట్ రౌడీ’ టైటిల్‌ను ఈ సినిమాకు వాడాలని బోయపాటి అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ.. ఇప్పుడు అది నిజం కాదని తేలిపోయింది. ఈ సినిమా నిర్మాత డి.వి.వి.దానయ్య తాజాగా ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్‌ను ఫిలింఛాంబర్‌లో డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రిజిస్టర్ చేయించారు. దీంతో ఈ డిఫరెంట్ టైటిల్ చరణ్-బోయపాటి సినిమా కోసమే అయ్యుంటుందని అంటున్నారు.

దసరా సీజన్‌లో ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు టైటిల్ రిజిస్టర్ చేశారని తెలిసింది. టైటిల్ సాఫ్ట్‌గా ఉన్నా బోయపాటి గత చిత్రం “జయ జానకీ నాయక” స్టైల్‌లో బాగుంది. మరి ఇలాంటి క్లాస్ టైటిల్ చరణ్ అభిమానులకు నచ్చుతుందా, లేదా అనేది చూడాల్సిందే. ఈ సినిమాకు “వినయ విధేయ రామ” టైటిల్ కనుక ఖరారైతే బోయపాటి తన సినిమా టైటిల్స్ విషయంలో పూర్తిగా రూట్ మార్చినట్టే. ఈ టైటిల్‌పై క్లారిటీ రావాలంటే మరో వారం రోజులు వేచి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus