మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. తన సమయం వృధా కాకుండా ఒక సినిమా షూటింగ్ సమయంలోనే మరో రెండు ప్రాజక్ట్ లను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 అనే సినిమాను చేస్తున్నారు. దీని తర్వాత మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలను తెరకెక్కించే కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి వచ్చే ఏడాది జనవరి నుంచి నాలుగు నెలలు కేటాయించినట్లు సమాచారం. దాని తర్వాత చరణ్ ఓ మాస్ మసాలా మూవీ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే బోయపాటి శ్రీనుకి ఒకే చెప్పినట్లు తెలిసింది.
దీని తర్వాత సినిమాకి కూడా వర్క్ జరుగుతోంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన చెప్పిన కథ నచ్చడంతో… కొన్ని మార్పులు చెప్పి సినిమా చేస్తానని మాట ఇచ్చారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. చెర్రీ చెప్పిన హంగులు జోడించి కథను సిద్ధం చేసే పనిలో త్రినాథరావు బిజీ అయినట్లు సమాచారం. దీనిని డి.వి.వి.దానయ్య నిర్మించడానికి రెడీగా ఉన్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఇది ఓకే అయితే… రామ్ చరణ్ డైరీ లో వచ్చే ఏడాది డేట్స్ మొత్తం లాక్ అయినట్లే.