RC15: చరణ్ శంకర్ కాంబో మూవీకి ఆ నటుడు హైలెట్ కానున్నారా?

చరణ్ శంకర్ కాంబో మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజవుతుందని దిల్ రాజు చెబుతుండగా దసరా కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సెకండాఫ్ లో కీలక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. చరణ్ శంకర్ కాంబో మూవీని దిల్ రాజు, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఉపేంద్ర ఏ సినిమాలో నటించినా తన నటన సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ శంకర్ కాంబో మూవీలో నెక్స్ట్ లెవెల్ సీన్లు ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. చరణ్ శంకర్ కాంబో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కియారా అద్వానీ, అంజలి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. చరణ్ కియారా అద్వానీ కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.

ఈ సినిమా ఫ్లాప్ అయినా ఈ ఫ్లాప్ సెంటిమెంట్ ను చరణ్ శంకర్ కాంబో మూవీ బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న చరణ్ ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తన రెమ్యునరేషన్ ను మరింత పెంచే ఛాన్స్ ఉంది. శంకర్ సినిమాలు ఈ మధ్య కాలంలో విజయాలను సొంతం చేసుకుంటున్నా ఆ సినిమాలు శంకర్ లెవెల్ లో సక్సెస్ సాధించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శంకర్ ఈ సినిమాకు 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. శంకర్ ఒకే సమయంలో చరణ్ శంకర్ కాంబో మూవీతో పాటు ఇండియన్2 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ శంకర్ కాంబో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus