Ram Charan: నాలుగు ప్రాజెక్ట్ లు ఫిక్స్.. ఆ హీరోలకు షాకిస్తూ?

  • December 1, 2022 / 02:52 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉండగా పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న చరణ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అవుతూ అభిమానులకు షాకిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.

రంగస్థలం మూవీని మించిన కథతో సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాల తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో చరణ్ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. చరణ్ లోకేశ్ కనగరాజ్ బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో ఈ కాంబినేషన్ లో సినిమా రావడం అంటే కష్టమైన విషయం అయితే కాదు. సినిమాల విషయంలో స్టార్ హీరో చరణ్ ప్లానింగ్ మామూలుగా లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇతర హీరోలు సైతం చరణ్ ప్లానింగ్ ను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఆర్.ఆర్.ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత కెరీర్ పరంగా మరింత ఎదగటానికి ఏ విధంగా అడుగులు వేయాలో రామ్ చరణ్ అదే విధంగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ రెమ్యునరేషన్ కంటే మంచి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేసే అవకాశం ఉన్నా

చరణ్ మాత్రం ఒక్కో ప్రాజెక్ట్ కు 60 కోట్ల రూపాయల నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. చరణ్ నెటిజన్ల ప్రశంసలు అందుకోవడంతో పాటు కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus