మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా ఈయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు 70% షూటింగ్ పనులు పూర్తి చేసుకుంది. మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఈ సినిమా షూటింగ్ తర్వాత రామ్ చరణ్ తన సినిమాల విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.
రామ్ చరణ్ ఉపాసన దంపతుల పెళ్లి తర్వాత పది సంవత్సరాలకు తల్లిదండ్రులు కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఉపాసన ఏడవ నెల ప్రెగ్నెంట్ కావడంతో మరికొద్ది రోజుల్లో మెగా ఇంటిలో బుల్లి వారసుడు లేదా వారసురాలు రాబోతున్నారు ఈ క్రమంలోనే తనకు పుట్టబోయే బిడ్డ కోసం రామ్ చరణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 10 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ కు పిల్లలు కాబోతున్న నేపథ్యంలో ఈయన తన పిల్లల కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారట.
ఉపాసన డెలివరీ అయిన తర్వాత మూడు నెలల పాటు తన చిన్నారితో గడపడం కోసమే రామ్ చరణ్ సమయం కేటాయించబోతున్నారని ఈ క్రమంలోనే తదుపరి సినిమాకు మూడు నెలలు విరామం ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. భార్య డెలివరీ అయిన తర్వాత భర్తగా తన పక్కన ఉంటూ తన అవసరాలను తీర్చడమే కాకుండా ఓ తండ్రిగా కూడా తన బిడ్డ మొదటి రోజులలో తండ్రి అవసరం ఎంతో ఉంటుందని.
రామ్ చరణ్ (Ram Charan) మూడు నెలల పాటు తన సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావించారట. ఈ విషయం తెలిసినటువంటి మెగా అభిమానులు రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజులలో గేమ్ చేంజెస్ సినిమా పూర్తి కానుంది. అంతలో ఉపాసన కూడా డెలివరీ కానున్న నేపథ్యంలో చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!