టెన్షన్ పడుతున్న రామ్‌చరణ్!!!

ఈ మధ్య అసలు మెగా ఫ్యామిలీ టైమ్ అస్సలు బాలేదు అనే చెప్పాలి….టాలీవుడ్ ను శాసిస్తున్నాం అని చెప్పుకుంటున్న మెగా అభిమానులు అక్కడ జరుగుతున్న విషయం గురించి పెద్దగా పట్టించుకోవడంలేదు అని తెలుస్తుంది.ఇంతకీ విషయం ఏమిటంటే…..టాలీవుడ్ లో ఎక్కువ మంచి హీరోలతో కళకళలాడుతున్న మెగా ఫ్యామిలీ ఆ రేంజ్ సక్సెస్ ను మాత్రం అందుకోవడానికి చాలా ఇక్కట్లు పడుతుంది. మరో పక్క అనేక సవాళ్ళ మధ్య మెగా ఫ్యామిలీ తన ఉనికిని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంది అని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న హాట్ న్యూస్…ఒక పక్క బాలయ్య తన సినిమా బిజినెస్ తో మెగా స్టార్ కు చుక్కలు చూపిస్తుంటే..మరో పక్క నాగ్ కుమారుడు చైతు “ప్రేమమ్” హిట్ తో చెర్రీని అయోమయంలో పడేశాడు.

ఇంతకీ ఏం జరిగింది అంటే…నిన్న విడుదల అయిన చైతు’ప్రేమమ్” సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ హిట్ చెర్రీకి  ఇబ్బందులు కొని తెచ్చేలా ఉంది…అదేలా అంటారా….దానికి కారణం ఏంటి అంటే…చైతన్యతో పాటు రామ్ చరణ్ ఎంచుకున్నది కూడ రీమేక్ సినిమాయే కావడం అంటున్నారు సినిమా విశ్లేషకులు. మలయాళ ‘ప్రేమమ్’ కు తెలుగు రీమేక్ గా వచ్చిన ‘ప్రేమమ్’ యూత్ కు బాగా కనెక్ట్ అయిన నేపధ్యంలో తమిళ సినిమా ‘తని ఒరువన్’ రీమక్ గా వస్తున్న ‘ధృవ’ కూడ ‘ప్రేమమ్’  రేంజ్ ల్ హిట్ కాకపోతే అది మెగా కాంపౌండ్ కు తీవ్ర అవమానంగా మారుతుంది అన్న భయం ప్రస్తుతం మెగా ఫ్యామిలీని వెంటాడుతున్నట్లు టాక్.

అంతేకాకుండా….మలయాళ మూవీ ‘ప్రేమమ్’ కు తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.అయితే తమిళ ‘తని ఒరువన్’ మూవీకి రీమేక్ గా వస్తున్న ‘ధృవ’ సినిమాను ఇంచుమించు ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా తమిళ సినిమా ఎలా ఉందో అలాగే కాపీ అండ్ పేస్ట్ గా దించేస్తున్నారు. అందుకే చెర్రీ ఈ సినిమా రిసల్ట్ పై టెన్షన్ పడుతున్నాడట…..ఎందుకంటే..తమిళ ఫ్లేవర్ మనవాళ్ళకు పెద్దగా రుచించదు కదా…..మరి చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus