ధృవ‌ టీజర్ లో అదరగొట్టిన మెగా ప‌వ‌ర్ స్టార్!

  • October 12, 2016 / 12:33 PM IST

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఏడాది క్రితం బ్రూస్లీ సినిమాతో పలకరించారు. ఆ సినిమా ఆశించినంతగా విజయం సాధించక పోవడంతో హిట్ కొట్టాలని కసితో ధృవ‌ కథను ఎంచుకున్నారు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన “త‌ని ఓరువ‌న్” రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు డైరక్టర్ సురేందర్ రెడ్డి సొంత క్రియేటివిటీని అప్లై చేశారు.

ఇందుకోసం చెర్రీ చాలా కస్టపడి అథ్లెట్ బాడీని సొంతం చేసుకున్నారు. వీరిద్దరి కష్టం దసరాకు విడుదలయిన ధృవ‌ టీజర్ లో కనిపిస్తోంది. ఇందులో చరణ్ అల్ట్రా మోడ్రన్ లుక్ తో  అదరగొడుతున్నారు. ఈ టీజర్లో  “నీ స్నేహితుడు ఎవ‌రో తెలిస్తే… నీ క్యారెక్ట‌ర్ తెలుస్తుంది. అదే నీ శ‌త్రువు ఎవ‌రో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది”  అని రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ టీజర్ విడుదలైన 20 గంటలలోనే 1.1 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసింది. 25,000 పైగా లైక్స్ ను సాధించింది.

గీతా ఆర్ట్స్ బ్యాన్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమిళ నటుడు అరవింద్ స్వామి విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus