‘మెగా 152’ లో రాంచరణ్ క్యారక్టర్ అదే..!

ప్రస్తుతం మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగానే మరో చిత్రాన్ని మొదలు పెట్టేసారు మెగాస్టార్. ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అపజయమెరుగని దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు చరణ్ కూడా ఓ పాత్ర చేస్తున్నాడని తాజా సమాచారం. మెగాస్టార్ ఉన్న ఈ చిత్రంలో చరణ్ ఏ పాత్ర చేస్తాడు. ఏదో ఫ్యాన్స్ ను అలరించడానికి మాత్రమే చరణ్ ను ఈ చిత్రంలో ఇరికిస్తున్నారా? అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చరణ్.. యంగ్ చిరంజీవిగా కనిపించబోతున్నాడట. అసలు విషయం ఏమిటంటే.. సోషల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ ఫ్లాష్ బ్యాక్ కు సంబందించిన ఎపిసోడ్ ఉందట. ఆ ఎపిసోడ్ చిరంజీవి కాస్త యంగ్ గా కనిపించాల్సి ఉందట. అయితే మొదట ఈ పాత్ర చిరంజీవే చేయాలనుకున్నారట. కానీ ఆ యంగ్ క్యారక్టర్ కి మరో హీరో అయితేనే బెటర్ అని చిరు సూచించారట. ఈ క్రమంలో చరణ్ తో పాటు వరుణ్, సాయి తేజ్ ను అనుకున్నారట. కానీ ‘రంగస్థలం’ లో చరణ్ అప్పటి కాలానికి చెందిన యువకుడిగా మంచి నటన కనపరిచాడు కాబట్టి… ఫైనల్ గా చరణ్ ను ఫిక్స్ చేశారట.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus