భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే సర్దార్ మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. కేవలం తన అభిమానులు తప్ప ఈ సినిమాను ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ పై కామెంట్స్ చేశాడు. టాలీవుడ్ ఖ్యాతిని ‘బాహుబలి’ ఆకాశంలో నిలబెడితే సర్దార్ గబ్బర్ సింగ్ తిరిగి టాలీవుడ్ ను పాతాళానికి దించేసిదని అభిప్రాయపడ్డారు వర్మ. ఈ సినిమా హిందీ ఓపెనింగ్ 2 పర్సెంట్ అని తేల్చేశారు. సర్దార్ బాలీవుడ్ కు వెళ్ళడం కరెక్ట్ కాదని.. నెల రోజుల ముందే చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిందే జరిగింది. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా.. కళ్ళు తెరిచి తన చుట్టూ ఉండే సలహాదారులను దూరంగా ఉంచితే మంచిదని ఉచిత సలహా కూడా ఇచ్చాడు.