టాలీవుడ్ లో మెగా హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కష్టపడి పైకి వచ్చము అనే పేటెంట్ రైట్స్ వారివే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే మెగా స్టార్ టాలీవుడ్ అరంగేట్రం నుంచి మళ్ళీ తాను సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేవరకూ ఆయన కరియర్ గురించి ఆయన తరువాత వచ్చిన మెగా హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇదిలా ఉంటే ఎప్పుడూ ట్విటర్ వేదికగా మెగా హీరోలపై శెటైర్స్ వేస్తూ, పంచస్ వేస్తూ చెలరేగిపోయే మన సంచలనాల దర్శకుడు వర్మ ఇప్పుడు తన ట్విటర్ అకౌంట్ తీసేసి సైలెంట్ అయిపోయాడు. అయితే వర్మను అభిమానించి ఆయన పెట్టే ట్వీట్స్ ను ఎంజాయ్ చేసే ఎంతోమంది ఫ్యాన్స్ చాలా మంది ఆయన చేసిన ఈ పనికి చాలా బాధపడుతున్నారు. వర్మ ఎందుకు ఇలా చేసాడో అర్ధం కాక ఆలోచనలో పడ్డారు.
అయితే అసలు వర్మ ఇలా ఎందుకు చేశాడు అంటే, ట్విట్టర్ నుండి బోర్ కొట్టేసిందంటూ చెప్పిన వర్మ అదే క్రమంలో ఓ రకంగా మెగా హీరోల వల్ల కూడా తాను ట్విట్టర్ నుండి బయటకు రావాల్సి వచ్చిందని అంటున్నాడు. మెగా హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూ వారిని ఇబ్బంది పెట్టిన కారణంగా వారి ఫ్యాన్స్ నుండి విపరీతమైన విమర్శలు ఎదుర్కున్నాడు ఆర్జివి. ఇక అలాంటివి జరుగకుండా అందరికి క్షమాపణలు చెప్పి అప్పుడు ట్విటర్ కి గుడ్ బై చెప్పాడు వర్మ. ఒక పక్క మెగా ఫ్యాన్స్ అంతా…వర్మ ట్విట్టర్ వదిలేయడానికి మెగా హీరోల ఫ్యాన్స్ నుండి గట్టి షాకే తగిలిందని అనుకుంటుంటే…అదే విషయాన్ని కాస్త డిఫరెంట్ గా ట్విటర్ ద్వారానే తెలిపి మెగా హీరోలకే కాది, వారి అభిమానులకి కూడా మెగా పంచ్ ఇచ్చాడు వర్మ అంటున్నారు వర్మ ఫాలోవర్స్. అదీ మొత్తంగా మ్యాటర్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.