రామ్‌గోపాల్ వర్మ తెలుగు సినిమాలు తీస్తుంటారు, తెలుగు న్యూస్ ఛానల్స్‌లో ఇంటర్వ్యూలు లాంటివి ఇస్తుంటారు, తెలుగు సినిమాల ఆడియో ఫంక్షన్లకు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వస్తుంటారు. తెలుగు టీవీ ఛానల్స్ సినిమా ఇంటర్వ్యూలకు వెళ్తుంటారు. కానీ తెలుగు టీవీ రియాలిటీ షోల్లో మాత్రం కనిపించరు. గతంలో దీని గురించి ప్రయత్నాలు జరిగాయో లేదో తెలియదు కానీ… ఈటీవీ వాళ్లు మాత్రం ఆర్జీవీని టీవీల్లోకి పట్టుకొచ్చారు. ఫెస్టివల్స్, స్పెషల్ డేస్ నాడు… అన్ని టీవీ ఛానల్స్ ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటాయి.
అలా ఈటీవీలో కూడా ఈ సారి ఓ ఈవెంట్ పెడుతున్నారు. దాని పేరు కొంచెం కాంట్రవర్శీగా ఉన్నా.. ఏదో నవ్వుకోవడానికి పెట్టారులే అనుకోవచ్చు. అదే ‘పెళ్ళాం వద్దు… పార్టీ ముద్దు’. ఈ షోకు సంబంధించి టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. సుమారు నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్లో ఓ షాకింగ్ ఎలిమెంట్ కనిపించింది. అదే ఆర్జీవీ. అవును ఆ ఈవెంట్లో రామ్‌గోపాల్ వర్మ గెస్ట్‌గా వచ్చారు. అంతే కాదు… స్టేజీ మీద అమ్మాయిలతో సందడి చేశారు.
ఈ క్రమంలో ‘మీ అందరినీ పెళ్లి చేసుకోవచ్చా?’ అంటూ ప్రపోజ్ కూడా చేశాడు. వర్మ ఇలా టీవీలకు రావడం, ఇలాంటి పనులు చేయడం కాస్త విచిత్రమే అనిపించొచ్చు. ఇంకా ఏమేం సందడి చేశారో డిసెంబరు 31న తెలుస్తుంది. టీజర్ ఆఖరున ఇంద్రజ చుట్టూ తన డైరక్టర్ కళ్లేసుకుని తిరగడం అయితే హైలైట్.