Ram Gopal Varma: హైపర్ ఆది పై అలాంటి కామెంట్స్ చేసిన వర్మ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వర్మ తాజాగా మెగాస్టార్ చిరంజీవి అలాగే కమెడియన్ హైపర్ ఆది గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైపర్ ఆది భోళా శంకర్ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయపరమైనటువంటి చర్చలకు కారణమయ్యేలా మాట్లాడారు. దీంతో ప్రస్తుతం మెగా వర్సెస్ వైఎస్ఆర్సిపి అనేలా మాటలు యుద్ధం జరుగుతోంది.

ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు ఇదిలా ఉండగా తాజాగా హైపర్ ఆది చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ హైపర్ ఆది గురించి మాట్లాడుతూ…జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది.

పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు. రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే మంచిది అంటూ ఈ సందర్భంగా వర్మ చేసినటువంటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వర్మ చేసినటువంటి ఈ వ్యాఖ్యలలో నిజం ఉందని పలువురు ఈ ట్వీట్ పై స్పందిస్తున్నారు.

ప్రస్తుతం ఇలాంటి బ్యాచ్ పొగడటంతో చిరంజీవి ఉప్పొంగిపోతున్నారని అయితే ఇలాంటి వారి వల్ల తన కెరీర్ కి ఇబ్బంది కలిగి పరిస్థితులు ఉన్నాయి అంటూ పలువురు వర్మ (Ram Gopal Varma) ట్వీట్ పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారందరినీ మెగా ఫ్యామిలీ కాస్త దూరం పెడితేనే వారి సినిమాలకు కాస్త మంచి జరుగుతుంది అంటూ వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus