సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలి మెగా ఫోన్ అందుకున్న ప్రవీణ్ సత్తారు శైలిని పట్టుకోవడం సినీ విశ్లేషకులకు కష్టం అవుతోంది. చందమామ కథలు అంటూ అందరి మనసులు మెలిపెట్టిన ఈ డైరక్టర్ .. వెంటనే గుంటూర్ టాకీస్ అంటూ హీట్ పుట్టించారు. అలాగే విజయానికి ఆమడ దూరంలో ఉన్న డాక్టర్ రాజశేఖర్ ని పిఎస్వి గరుడ వేగ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కించారు. ఇలా ప్రతి సినిమాకి కొత్త జానర్ కథని ఎంచుకుంటూ విజయాన్ని అందుకుంటున్నారు.
అందుకే అతని నెక్స్ట్ ప్రాజక్ట్ పై ఆసక్తి నెలకొనింది. ఈ డైరక్టెర్ ఎనర్జిటిక్ హీరో రామ్ కి ఓ స్పెషల్ స్టోరీ రెడీ చేసారని తెలిసింది. ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో ఆకట్టుకున్న రామ్కి ప్రవీణ్ చెప్పిన కథ బాగా నచ్చిందంట. వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో నటించేందుకు రామ్ సిద్ధం అవుతున్నారు. మార్చిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించనున్నారు. భవ్యక్రియేషన్ బ్యానర్ లో నిర్మితం కానున్న ఈ మూవీ గురించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.