సహజంలో సినిమా ఇండస్ట్రీలో అందరూ హిట్ ఫొర్ములా ఉన్న వారి వెనుక పరుగులు తీస్తూ ఉంటారు. అలాగే ఫ్లాప్ దరిద్రం తలకు చుట్టుకుంటే ఆ దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఒక్కొకరికి కలసి వస్తుంది, ఒక్కొక్కరికి కలసి రాదు. ఇంతకీ ఈ కధంతా దేనికంటే దర్శకుడు శ్రీను వైట్ల గుర్తున్నాడా? ఎందుకు గుర్తు ఉండడులే ఒకటా..రెండా..ఎన్నో హిట్ సినిమాలు తీసి, ఒకానొక సమయంలో ఇండస్ట్రీ రికార్డ్స్ ని కూడా సృష్టించాడు.
అయితే అలాంటి శ్రీను వైట్లకు ఈ మధ్య అసలు ఏమీ కలసి రావడం లేదు. ఆగడు సినిమా పుణ్యమా అంటూ శ్రీను దర్శకత్వ స్టార్‌డం ఒక్కసారిగా పడిపోయిందో. ఇక ఆ తరువాత వచ్చిన బ్రూస్ లీ సినిమాతో అతను అల్ మోస్ట్ తెరమరుగు అయిపోయాడు అన్నట్లు అనిపించింది. ఇదిలా ఉంటే మళ్లీ పాత ఖ్యాతిని తెచ్చుకోవాలనే ఆలోచనతో శ్రీను వైట్ల హీరో రామ్ కు కధ చెప్పాడు. అసలే ఫ్లాప్స్ లో ఉన్న రామ్ శ్రీనుతో ఒక సినిమా చెయ్యాలి అని ఆలోచనలో ఉన్నాడు. ఇదంతా ‘నేను శైలజ’ సినిమా విడుదల కాక ముందు. అయితే ఎప్పుడైతే నేను శైలజ హిట్ అయ్యిందో రామ్ మనసు మారిపోయింది. కధ చెప్పిన శ్రీనుకి తర్వాత అభిప్రాయం చెబుతా అన్నాడంట.
ఇక విషయం అర్ధం అయిన శ్రీను అదే కధను మన మెగా బ్రదర్ తనయుడు వరుణ్ తెజ్ కు చెప్పగా, అతనికి ఆ కధ నచ్చడంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని వరుణ్ తొలి సినిమా ‘ముకుంద’ను ప్రొడ్యూస్ చేసిన నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్నారు. పాపం శ్రీను ఎలా ఉండే వాడు..ఎలా అయిపోయాడు.