పైన ఫొటో చూసి.. ‘రామాయణ’ సినిమా బడ్జెట్ రూ.4000 కోట్లు అన్నారు కదా.. మీరు రూ.2000 కోట్లు అంటున్నారేంటి? అని అనుకుంటున్నారా? అవును ఈ సినిమాకు బడ్జెట్ రూ.4000 కోట్లే. కానీ రెండు భాగాలుగా రూపొందుతున్న సినిమా కాబట్టి ఒక సినిమాకు రూ.2000 కోట్లు. ఇక అసలు విషయానికొస్తే.. సినిమా ప్రచారం షురూ చేయడం. దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే టీమ్ చెప్పేసింది.. అయితే ఇప్పుడు సినిమా ట్రైలర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇప్పుడు చెప్పేశారు.
ఇండియన్ సినిమా చరిత్రలో ప్రస్తుతం భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. రణ్‌బీర్ కపూర్ – సాయిపల్లవి – యశ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాను నితీశ్ తివారి తెరకెక్కిస్తున్నారు. జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కొన్ని వేల సంవత్సరాలుగా ధర్మం, మర్యాద, ధైర్యం, కరుణ అనే ఆదర్శాలతో ‘రామాయణం’ ఎన్నో తరాలకు స్ఫూర్తినిచ్చింది. మన నాగరికతకు అద్దం పట్టే ఈ గొప్ప ఇతిహాసాన్ని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేయబోతున్నాం అని చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ సినిమా తొలి భాగంలో రావణుడి పాత్ర మితంగా ఉంటుందని ఇప్పటికే టీమ్ చెప్పేసింది. అంటే రాముడి అరణ్యవాసం మొదలయ్యే సమయానికి సినిమా కథను నిలిపేస్తారు. రెండో పార్టును వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ చేస్తారు. అయితే ఈ సినిమాకు ఇంత బడ్జెట్ అవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. దీనికి సమాధానం ట్రైలర్‌తోనే టీమ్ చెబుతుంది. సినిమా గ్రాండియర్ థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయండి అని అంటున్నారు. మరి 24న ఏం చేస్తారో చూడాలి. సినిమా దివాళీకి అంటే నవంబర్ 8న అని మీకు తెలిసే ఉంటుంది.