రంభపై ప్రేమను చాటుకున్న ఆమె భర్త

  • August 14, 2018 / 11:22 AM IST

సినీ నటి రంభకు పూల వర్షం కొత్తకాదు. సినీ జీవితంలో అనేక సార్లు పూల మధ్య స్టెప్పులు వేసింది. ఇప్పుడు నిజ జీవితంలో పూల వానలో తడిసి ముద్దయింది. ఎందుకు? ఏమిటి ? వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ 2010లో కెనడాకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. దుబాయ్ లోనే కాపురం పెట్టారు. ఇద్దరి పిల్లలకు తల్లి అయింది. అనంతరం భర్తతో గొడవరావడంతో ఇండియాకి తిరిగి వచ్చేసింది. 2016లో విడాకులు కావాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కేసును పరిశీలించిన కోర్టు ఇద్దరూ కలిసి ఓ అవగాహనకు రావాలంటూ సూచన చేసింది.

దీంతో భార్యాభర్తలిద్దరూ మళ్లీ కలిసి జీవించడం మొదలెట్టారు. ఇప్పుడు మరింత అన్యోన్యంగా ఉన్నారు. అందుకు గుర్తుగా రంభ మళ్లీ తల్లి అయింది. మూడో సంతానానికి జన్మనివ్వబోతోంది. ఈ సందర్భంగా ఆమెకు శ్రీమంతం చేశారు. ఈ వేడుకలో రంభ భర్త ఆమెపై ఎంతో ప్రేమతో పూలవర్షం కురిపించారు. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈసారి అబ్బాయి పుట్టాలని రంభ కోరుకుంటోంది. ఆమె కోరిక నెరవేరాలని కుటంబ సభ్యులు, ఆత్మీయులు ఆశీర్వదించారు. డెలివరీ తర్వాత కొన్ని నెలలలు రెస్ట్ తీసుకొని అప్పుడు నటనపై దృష్టి పెట్టనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus