రాంచరణ్ బాబాయ్ గా తమిళ నటుడు

  • December 18, 2018 / 01:54 PM IST

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ ముల్టీస్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే..! ఇప్పటి వరకూ మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తప్ప మిగిలిన కాస్టింగ్ కు సంబందించిన వివరాలేమీ రాజమౌళి ప్రకటించలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది.

ఇప్పటికే అజయ్ దేవగన్, ‘కే.జి.ఎఫ్’ హీరో యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని వార్తలొచ్చాయి.ఇప్పుడు మరో ప్రముఖ నటుడు పేరు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం తెలుగులో ‘శంభో శివ శంభో’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన దర్శకుడు మరియు నటుడు అయిన సముద్రఖని ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడట. రాంచరణ్ బాబాయ్ పాత్రలో సముద్రఖని కనిపిస్తాడని సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus