సూర్య సినిమాలో సీనియర్ హీరోయిన్ !!
- November 30, 2016 / 02:02 PM ISTByFilmy Focus
“బాహుబలి”లో రాజమాత శివగామిగా రాజసానికి రవ్వంత యాటిట్యూడ్ ను జత చేసి నటించిందో అప్పట్నుంచి రమ్యకృష్ణకు ఆఫర్లు మళ్ళీ క్యూ కట్టాయి. నిజానికి నాలుగేళ్ల క్రిందటే రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టినప్పటికీ.. అప్పుడు ఆమెను పెద్దగా పట్టించుకొనేవారు లేకపోయారు. అయితే.. “బాహుబలి” భీభత్సమైన హిట్ అయిపోవడంతో రమ్యకృష్ణ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
తాజాగా రమ్యకృష్ణ మరో ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే అవకాశం సొంతం చేసుకొందని తెలుస్తోంది. “నానుమ్ రౌడీధాన్” అనంతరం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య-కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రంలో రమ్యకృష్ణ ఓ ముఖ్యభూమిక పోషించనుందని సమాచారం. సూర్య తల్లి పాత్ర పోషింస్తుందా లేక నెగిటివ్ రోలా అనే విషయంపై ప్రస్తుతం చెన్నై వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇకపోతే.. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న షెడ్యూల్ లో రమ్యకృష్ణ పాల్గొంటోంది!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












