హుషారు సినిమాతో వెండితెరకి పరచయమైంది రమ్య పసుపులేటి. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటుంది. హుషారు, ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్, కమిట్‌మెంట్, మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమాలు చేసింది. ఈ చిన్నది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఈ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనుందని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రమ్య తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.