ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది కేవలం నటుడు నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్ గురించి అని చెప్పాలి. ప్రస్తుతం వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.అయితే వీరిద్దరి మధ్యలోకి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంట్రీ ఇచ్చారు.నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలియగానే రమ్య ఎంట్రీ ఇచ్చి నరేష్ గురించి పవిత్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
నరేష్ పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని కేవలం వార్తలు మాత్రమే వచ్చాయి వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని రమ్య వెల్లడించారు.ఇక తన భర్తతో తనకు విడాకులు అధికారకంగా రాలేదని విడాకులు రాకుండానే మరో పెళ్లి ఎలా చేసుకుంటారు అంటూ ఈమె ప్రశ్నించారు. ఇక మా పెళ్లి జరిగిన తర్వాత నరేష్ కు మహిళలతో సంబంధాలు ఉన్నాయని విషయం తెలిసింది. అప్పటికే ఈ విషయాలన్నీ మా అత్తగారు విజయనిర్మల గారికి కూడా తెలుసు.
ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని నరేష్ నన్ను క్షమించమని అడిగేవారు. ఇకపోతే ఎప్పుడైతే పవిత్ర లోకేష్ పెళ్లి వార్తలు వచ్చాయో అప్పుడే నాకు కోర్టు నుంచి విడాకులు నోటీసులు కూడా వచ్చాయని, విడాకులపై సంతకం పెట్టాలంటూ నరేష్ గన్ తో బెదిరించారని ఈమె షాకింగ్ కామెంట్ చేశారు. ఈ విధంగా మా మధ్య జరిగే ఈ గొడవలన్నీ విజయనిర్మల గారికి తెలుసు. అయితే కేవలం తన కొడుకు కోసమే వీటిని భరిస్తూ వచ్చానని రమ్య వెల్లడించారు.
ఇక అప్పట్లో నేను ఇంటి నుంచి వెళ్తానంటే వెళ్లకూడదని అత్తగారు మాట తీసుకున్నారని రమ్య తెలిపారు. ప్రస్తుతం తన భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి తనకు ఇష్టం లేదని తిరిగి తన ఫ్యామిలీని చక్కు పెట్టుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా రమ్య రఘుపతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రమ్య చేసిన వ్యాఖ్యలపై నరేష్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!