మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నంబర్ 150 మూవీ పై ఒక్కొక్కరోజు ఒక్కో విషయం బయటికి వచ్చి చిత్రం పై అంచనాలను పెంచేస్తున్నాయి. ఐటెం సాంగ్ లో స్పెషలిస్ట్ అయిన రాయ్ లక్ష్మితో చిరు స్టెప్పులు వేయడం మాస్ ప్రేక్షకులను ఊరిస్తుంటే.. టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించడం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకర్షిస్తోంది. వీరిద్దరూ ఆడి పాడిన “అమ్మడు లెట్స్ డు కుమ్ముడు” పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 30 సెకన్లు కనిపించి మెగా అభిమానులను అలరించనున్నారు. ఈ చిత్రాన్ని అన్ని హంగులతో తెరకెక్కిస్తున్న దర్శకుడు వి.వి.వినాయక్ ఈ మూవీలో చిన్న పాత్రలో కనిపిస్తుండడం విశేషం.
ఇప్పుడు ఈ చిత్ర బృందంలోకి యువనటులు రానా, నవదీప్ జాయిన్ అయ్యారు. మూవీకి మరింత క్రేజ్ తీసుకురానున్నారు. వీరిద్దరి సినిమాలో నటించకపోయినా జనవరి 4న విజయవాడలో జరగనున్న ఖైదీనంబర్ 150 ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హోస్ట్ గా వ్యహరించనున్నారు. తన మాటలతో కార్యక్రమానికి జోష్ పెంచనున్నారు. ఈ వేదికపై మెగాస్టార్ చెప్పే కొన్ని డైలాగులను రానా చెప్పేందుకు ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిసింది. నిర్మాత రామ్ చరణ్ సినిమాను ఎలా తీయాలో అనే కాదు.. ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలో అనే విషయంలోనూ ఆరితేరిపోయినట్లున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.