దగ్గుబాటి రానా ఈ లాక్ డౌన్ టైంలో ఎవ్వరూ ఊహించని విధంగా పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. గతంలో ‘అసలు పెళ్ళికి నాకు సెట్ అవ్వదు… దాని పై పూర్తి అవగాహన వచ్చే వరకూ పెళ్లి చేసుకోను’ అని చెప్పిన వాడు.. ‘ఆమె యెస్ చెప్పింది పెళ్లి చేసుకుంటున్నాను’ అంటూ ప్రకటించడంతో అందరూ బిత్తరపోయారు. ఏదేమైనా రానా.. ప్రముఖ ఈవెంట్ మేనేజర్ మిహీక బజాజ్ ను ఆగష్ట్ లోనే పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ప్రస్తుతం ఆయన హానీమూన్లో ఉన్నాడని తెలుస్తుంది.
తాజాగా రానా- మిహీకలకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనికి రానా అభిమానులు.. ‘దగ్గుబాటి కపుల్ సూపర్’, కపుల్ గోల్స్, సూపర్ కూల్ పిక్ వంటి కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రానా నటించిన ‘అరణ్య'(హాతి మేరీ సాతి) ఏప్రిల్ లోనే విడుదల కావాల్సినప్పటికీ కరోనా వల్ల వాయిదా పడింది. అది భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి.. థియేటర్స్ లోనే విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఇక వేణు ఉడుగుల డైరెక్షన్లో రానా నటిస్తున్న ‘విరాటపర్వం’ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. నవంబర్ నుండీ రానా ఈ చిత్రం షూటింగ్లో జాయినవ్వనున్నాడు. వీటితో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ లో నటించడానికి కూడా రానా రెడీ అవుతున్నాడు.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!