Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘విరాట‌ప‌ర్వం’లో డాక్ట‌ర్ ర‌విశంక‌ర్ అలియాస్ కామ్రేడ్ ర‌వ‌న్న‌గా రానా!

‘విరాట‌ప‌ర్వం’లో డాక్ట‌ర్ ర‌విశంక‌ర్ అలియాస్ కామ్రేడ్ ర‌వ‌న్న‌గా రానా!

  • December 14, 2020 / 08:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘విరాట‌ప‌ర్వం’లో డాక్ట‌ర్ ర‌విశంక‌ర్ అలియాస్ కామ్రేడ్ ర‌వ‌న్న‌గా రానా!

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాట‌ప‌ర్వం’. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. సోమ‌వారం, డిసెంబ‌ర్ 14 రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘విరాట‌ప‌ర్వం’లో ఆయ‌న ఫ‌స్ట్ లుక్‌తో పాటు ఆయ‌న క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ఫ‌స్ట్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఫ‌స్ట్ లుక్‌లో ఆలివ్ గ్రీన్ యూనిఫామ్‌లో న‌క్స‌లైట్ లుక్‌లో గ‌న్ చేత‌బ‌ట్టి న‌డుచుకుంటూ వ‌స్తోన్న రానా క‌నిపిస్తున్నారు. ఆయ‌న వెనుక షాడోలో గ‌న్స్‌, ఎర్ర‌జెండాలు ప‌ట్టుకొని ఆయ‌న బృందం అనుస‌రిస్తోంది. క‌ళ్ల‌లోని తీక్ష్ణ‌త రానా పాత్ర తీరును, “రివ‌ల్యూష‌న్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్” అనే క్యాప్ష‌న్ ‘విరాట‌ప‌ర్వం’ థీమ్‌ను తెలియ‌జేస్తున్నాయి. పోస్ట‌ర్‌పై మొద‌ట సాయిప‌ల్ల‌వి పేరు, త‌ర్వాత రానా ద‌గ్గుబాటి పేరును ప్ర‌స్తావించ‌డం చూస్తుంటే, సాయిప‌ల్ల‌వి పాత్ర‌కు ఎంత‌టి ప్రాముఖ్యం ఉందో, ఆమెకు చిత్ర బృందం ఎంత‌టి గౌర‌వాన్ని ఇస్తుందో అర్థ‌మ‌వుతోంది. ఇప్పుడు ‘విరాట‌ప‌ర్వం’లో రానా ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఫ‌స్ట్ గ్లింప్స్ (తొలి వీక్ష‌ణం) విష‌యానికి వ‌స్తే, రానా చేస్తున్న క్యారెక్ట‌ర్ ఏమిటో, ఆ పాత్ర ఎలా ఉంటుందో తెలుస్తున్నాయి. “ఈ దేశం ముందు ఓ ప్ర‌శ్న‌గా నిల‌బడ్డ జీవితం అత‌నిది.. స‌త్యాన్వేష‌ణ‌లో నెత్తురోడిన హృద‌యం అత‌నిది.. డాక్ట‌ర్ ర‌విశంక‌ర్ అలియాస్ కామ్రేడ్ ర‌వ‌న్న” అంటూ రానా పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు. 1990ల‌లో జ‌రిగిన య‌థార్థ‌ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. ఒక షాట్‌లో స్టూడెంట్ లీడ‌ర్‌గా క‌నిపించారు రానా. వీడియో చివ‌ర‌లో “ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం?”.. అని ఒక కామ్రేడ్‌ ప్ర‌శ్నిస్తే, మిగ‌తా వారంతా “దొంగ‌ల రాజ్యం.. దోపిడి రాజ్యం” అంటూ నినాదాలు చేశారు. రానాకు బ‌ర్త్‌డే విషెస్ చెబుతూ తొలి వీక్ష‌ణం ముగిసింది. సినిమా “త్వ‌ర‌లో మీ ముందుకి” వ‌స్తున్న‌ట్లు తెలిపారు.

ఈ ఫ‌స్ట్ గ్లింప్స్ చూస్తుంటే గూస్‌బంప్స్ వ‌స్తున్నాయ‌ని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల మ‌రో ఇంప్రెసివ్ కాన్సెప్ట్‌తో మ‌న ముందుకు రానున్నాడ‌ని ఈ చిన్న వీడియో తెలియ‌జేసింది. రానా ఇందులో మొద‌ట మెడికో ర‌విశంక‌ర్‌గా క‌నిపించి, త‌ర్వాత కామ్రేడ్ ర‌వ‌న్న‌గా మార‌తాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ రానా చేసిన పాత్ర‌ల‌న్నీ ఒకెత్తు అయితే, ‘విరాట‌ప‌ర్వం’లోని డాక్ట‌ర్ ర‌విశంక‌ర్ అలియాస్ కామ్రేడ్ ర‌వ‌న్న క్యారెక్ట‌ర్ ఒక్క‌టీ ఒకెత్తు అని చెప్ప‌వ‌చ్చు. ఆ పాత్ర‌లో రానా ప‌ర్‌ఫెక్ట్‌గా ఇమిడిపోయి క‌నిపిస్తున్నారు. ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. మిగ‌తా ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు.

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dr Ravi Shankar
  • #Eswari Rao
  • #Nanditha Das
  • #Naveen Chandra
  • #Nivetha Pethuraj

Also Read

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

related news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

trending news

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

14 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

24 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 days ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

15 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

16 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

17 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

19 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version