Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్ గా నటించగా శ్రీయ, జగపతి బాబు వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు మంచు మనోజ్ కూడా ఈ సినిమాలో విలన్ గా నటించడం ప్రత్యేక ఆకర్షణని సంతరించుకుంది. టీజర్, ట్రైలర్స్ కూడా సినిమాపై బజ్ ఏర్పడేలా చేశాయి.

Rana Daggubati in Mirai

ఇందులో కూడా మైథలాజికల్ టచ్ ఉండటంతో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఈ సినిమాపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బుక్ మై షోలో బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. కానీ మరీ ‘హనుమాన్’ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే కాదు. టాక్ ను బట్టి ఓపెనింగ్స్ పెరిగే అవకాశం ఉంది.

మరోవైపు ‘మిరాయ్’ కి మరింత హైప్ తెచ్చే ప్రయత్నం మేకర్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘మిరాయ్’ లో 2 సర్ప్రైజులు ఉన్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ చెప్పుకొచ్చారు. దీంతో కొంతమందిలో ఆసక్తి పెరిగింది. 2 సర్ప్రైజ్..లు అంటే మరో హీరో స్పెషల్ ఎంట్రీ ఇస్తాడని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది విశ్లేషకులు ‘ఈ సినిమాలో ఒక పాత్ర కోసం ‘మిరాయ్’ మేకర్స్ టాలీవుడ్ స్టార్స్ అందరినీ సంప్రదించారని’ చెబుతున్నారు.

అలాగే ఆ 2 సర్ప్రైజ్..లలో ఒకటి రానా అంటున్నారు. మరో సర్ప్రైజ్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే ‘రానా క్యామియో కూడా ఓ సప్రైజేనా?’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిజమే రానా చాలా సినిమాల్లో క్యామియోలు ఇస్తూనే ఉన్నాడు. నిఖిల్ ‘స్పై’, నవదీప్ ‘లవ్ మౌళి’ వంటి చిన్న చితకా సినిమాల్లో కూడా రానా కామియోలు ఉన్నాయి. అవి ఏమీ ఆడియన్స్ కి సర్ప్రైజింగ్ ఫీలింగ్ ఇవ్వలేదు.. ఆ సినిమాలకి కూడా ఏమీ కలిసి రాలేదు. అప్పుడు ‘మిరాయ్’ కి కలిగే అడ్వాంటేజ్ ఏముంటుంది? అనేది నెటిజన్ల అభిప్రాయం కావచ్చు

ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయ్యింది.. ఆ లోటు మాత్రం తీరలేదు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus