మరో మల్టీస్టారర్ కు రెడీ అవుతున్న రానా?

రానా ప్రస్తుతం వేణు ఉడుముల డైరెక్షన్లో ‘విరాటపర్వం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే ఈ చిత్రం షూటింగ్ మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా రానా మరో మల్టీ స్టారర్ చిత్రానికి ఓకే చెప్పాడట. కెరీర్ ప్రారంభంలో కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా క్రేజ్ సంపాదించుకున్నాడు రానా. అజిత్ తో కలిసి ‘ఆరంభం'( తెలుగులో ‘ఆట ఆరంభం’) అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రంలో ఆర్య కూడా మరో హీరోగా నటించాడు.

ఇక ‘బెంగుళూర్ డేస్’ రీమేక్ లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. ఇదిలా ఉండగా ఇప్పుడు కోలీవుడ్లో మరో మల్టీ స్టారర్ లో నటించేందుకు రానా రెడీ అవుతున్నాడట. పా రంజిత్ దర్శకుడు డైరెక్షన్లో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తుంది. రజినీ కాంత్ తో ‘కబాలి’ .. ‘కాలా’ వంటి చిత్రాలు తెరకెక్కించిన రంజిత్.. ఇప్పుడు ఓ భారీ మల్టీ స్టారర్ గా కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ చిత్రంలో ఓ హీరోగా రానాను ఫిక్స్ చేసాడట. ఈ కథకి రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. మరో కథానాయకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus